ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » దేవీ నవరాత్రి ఉత్సవాలు » కనకదుర్గమ్మకు విరాళంగా పగడాల హారం (Religion| Kanaka Durga| Navratri| Indrakiladri| Bezawada| VijayaWada)
 
Durga
FILE
ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు పగడాల హారం విరాళంగా అందింది. శరన్నవరాత్రులను పురస్కరించుకు ప్రతిరోజూ ఓ స్వరూపంలో భక్తులను అనుగ్రహిస్తోన్న కనకదుర్గమ్మ తల్లికి ఎనిమిది లక్షల రూపాయల విలువైన హారాన్ని విరాళంగా అందజేశారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చెందిన సినీ నిర్మాతలు వెంకట్, అచ్చిరెడ్డిలు అమ్మవారికి కానుకగా అందజేసినట్లు ఆలయ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఇదిలా ఉండగా.. మహానవమిని పురస్కరించుకుని కనకదుర్గమ్మ ఆలయానికి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. అష్టమి రోజైన శనివారం కనకదుర్గమ్మను భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.