ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » దేవీ నవరాత్రి ఉత్సవాలు » విజయదశమినాడు శుభకార్యాలకు శ్రీకారం చుట్టండి (VijayaDasami| Durga Devi| Simhavahini| Navratri| Ramayana| MahaVishnu)
 
Durga
WD
దేవీ నవరాత్రి పూజలు రామాయణ కాలంనాటికే జరుపుకోవడం ఆచారంగా ఉంది. దసరా అంటే ధన్-హరా అని, అంటే శ్రీరామచంద్రమూర్తి సీతాపహరణ గావించిన రావణాసురిని పదితలలు నరికి సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సవాన్నే దసరాగా పేర్కొంటున్నారు.

ఇక నవరాత్రి వ్రతాన్ని తొమ్మిదిరోజులు దేవినవరాత్రి వ్రతంగా ఆచరించి విజయదశమి రోజున వ్రతసమాప్తి చేయడం ఆచారంగా వస్తోంది.

"ప్రథమాశైలపుత్రి, ద్వితీయా బ్రహ్మచారిణీ
తృతీయాచంద్రఘంటీతి, కుష్మాండేతి చతుర్థికీ
పంచమా కాళరాత్రిచ అష్టమాచాతి భైరవీ
నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా."

మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒక్కరే.. అలంకారాలు వేరైనా అమ్మ దయ అందరిపట్ల ఒక్కటే. అట్టి మహిమాన్వితమైన ఆ దేవదేవి ఆవిర్భావ విశేషమేమిటంటే..? పూర్వం మధుకైటభులనే రాక్షసులను వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణువును నిద్రలేపింది. యోగనిద్రనుంచి మేల్కొన్న విష్ణువు, మధుకైటభులతో పదివేల సంవత్సరాలు పోరాడినా, వారిని జయించలేకపోతాడు. ఆ పరిస్థితిని గమనిస్తున్న మహాదేవి.. ఆ మధుకైటభులను మోసపూరితుల్ని చేస్తుంది.

దానితో వారు అంతకాలంగా తమతో పోరాడినందులకు శ్రీ మహావిష్ణవును మెచ్చుకుని నీకు ఏం వరంకావాలి అని ప్రశ్నిస్తారు? దానితో శ్రీహరి వారి మరణాన్ని వరంగా కోరుకుంటాడు. దానితో వారు తమకు ఇక మరణము తప్పదని నిర్ణయించుకుని, తమను నీరులేనిచోట చంపమని కోరతారు. అంతటితో శ్రీమహావిష్ణువు వారిని పైకెత్తి భూఅంతరాళంతో సంహరించు సమయాన.. మహామాయ పదితలతో, పదికాళ్లతో, నల్లనిరూపుతో "మహాకాళి"గా ఆవిర్భవించి శ్రీ మహావిష్ణవునకు సహాయపడుతుంది.

అనంతరం "సింహవాహినిగా" మహిషాసురుని, మహామాయ సరస్వతి రూపిణిగా, శుంభ, నిశుంభలను వధించింది. చండ, ముండలను సంహరించి చాముండి అని పేరు తెచ్చుకుంది. కంస సంహారమునకు సహాయపడుటకై "నంద" అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీ కృష్ణునికి సహాయపడింది.

తర్వాత ఐదో అవతారంసో ఒక రాక్షస సంహార సమయాల్లో ఆమె దంతాలు రక్తసిక్తమవడం వల్ల "రక్తదంతి" అయినది. లోకాలన్నింటిని కరువుకాటకముల నుంచి తప్పించి "శాకంబరి"గా పేరు సంపాదించింది. ఇలా దుర్గుడను రాక్షసుడిని సంహరించి "దుర్గ"గా, మాతంగిగా నవవిధ రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తోన్న అమ్మవారిని, పరాశక్తిని నవరాత్రుల్లో ప్రార్థించి విజయదశమి నాడు నిష్టతో పూజించే వారికి సకల సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.

అలాగే విజయదశమి నాడు విద్యాభ్యాసంతో పాటు ఏదేనీ శుభకార్యాలకు శ్రీకారం చుడితే విజయవంతమవుతాయని వారు చెబుతున్నారు. అందుచేత విజయదశమి నాడు అందరూ అమ్మవారిని నిష్టతో పూజించి.. శుభకార్యానికి శ్రీకారం చుట్టండి. మరి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు..!.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.