ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > సెప్టెంబర్ 3 నుంచి గణేశ్ ఉత్సవాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సెప్టెంబర్ 3 నుంచి గణేశ్ ఉత్సవాలు
WD
లక్షలాది మంది భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకునే గణేశ్ ఉత్సవాలు వచ్చేనెల (సెప్టెంబర్) 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. నిమజ్జనోత్సవాల ఊరేగింపు 14న జరుగుతుందని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కార్యదర్శి జి. హనుమంతరావు వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన నిమజ్జన ఊరేగింపును మరింత శోభాయమానంగా నిర్వహించేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

సెప్టెంబర్ 3న వినాయక చవితి సందర్భంగా జంటనగరాల్లోని వాడవాడలా మంటపాలను ఏర్పాటు చేసుకుని స్థానిక భక్తులు విగ్రహాలను ప్రతిష్టించి నవరాత్రి ఉత్సవ పూజలను ప్రారంభించడం ప్రతీతి.

అత్యంత వైభవంగా జరుపుకునే గణేశ్ ఉత్సవాలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపట్టనున్నట్లు హనుమంతరావు తెలిపారు. మరోవైపు బెంగుళూరు-అహ్మదాబాద్ బాంబు పేలుళ్లను అనుసరించి ఉత్సవాలకు పట్టిష్ట బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.
మరిన్ని
పద్మావతి అమ్మవారికి వజ్ర కిరీటం!
గోవిందా... ఏదయా నీకు రక్షణ
మంగాపురం వద్ద శ్రీవారి మెట్లోత్సవం
16న పాక్షిక చంద్రగ్రహణం : శ్రీవారి ఆలయం మూసివేత
రేపు శ్రీవారి ఆలయం మూసివేత
గండి ఏర్పాట్లు రెండు రోజుల్లో పూర్తి కావాలి