తిరుపతి తిరుమల దేవస్థానంలో ఖాళీలను పూరించేందుకు ధర్మకర్తల మండలి అమోదించింది. బుధవారం అన్నమయ్య భవన్లో జరిగిన సమావేశంలో తీర్మానించారు. చాలా కాలంగా టీటీడీలో చాలా కాలంగా ఖాళీలున్నాయి. వీటిపై ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకోవడం పట్ల ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తం చేశారు.
టీటీడీ బోర్డు అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇందులో మరెన్నో నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ప్రధానమైనది 2 వేల ఉద్యోగాలు పూర్తి చేయడం కాగా తిరుమలలో పని చేసే ఉద్యోగులకు అదనంగా రూ.300 అలవెన్సు ఇవ్వాలని నిర్ణియించారు.
వేదపాఠశాల, బధిరీల పాఠాశాలకు నిధులు విడుదల చేయాలని తీర్మానించారు.సంభావన ఆధారంగా పనిచేస్తున్న 47 మంది తాత్కాలిక కార్మికుల ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని నిర్ణయించారు. కడప జిల్లాలో 108 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అమృతోత్సవాలలో భాగంగా ప్రస్తుత ఉద్యోగులకు ఇచ్చే ఐదు గ్రాముల బంగారాన్ని పదవీ విరమణ చేసిన వారికి కూడా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఈవో రమణాచారి తదితర అధికారులు మిగిలిన బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
|