ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > సీతాసమేత శ్రీరామునికి స్వర్ణ ధనుర్భాణాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సీతాసమేత శ్రీరామునికి స్వర్ణ ధనుర్భాణాలు
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామికి స్వర్ణ ధనుర్భాణాలను గురువారం ఓ భక్తుడు సమర్పించారు. భద్రాచలం ఆర్టీసీ డిపోలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సిహెచ్ మోహన్‌రావు దంపతులు ఈ ధనుర్భాణాలను దేవస్థానం ప్రధాన అర్చకులు కోటి రామకృష్ణమాచార్యులు, పొడిచేటి రామచంద్రాచార్యులకు అందించారు.

తర్వాత ఆలయ ప్రధానార్చకులు ధనుర్భాణాలకు సంప్రోక్షణ నిర్వహించి మూలవిరాట్‌లకు వీటిని ధరింపజేశారు. ఈ సందర్భంగా మోహన్‌రావు దంపతులు మాట్లాడుతూ, స్వామి వారికి ఈ ఆభరణాలు సమర్పించడం చాలా ఆనందంగా ఉందన్నారు. వీటి విలువ కనీసం రూ.40 వేల దాకా ఉంటుందని అన్నారు.
మరిన్ని
తిరుమలలో నవంబర్ 2న నాలుగో విడత కల్యాణమస్తు
తిరుపతిలో పెరగనున్న రద్దీ
నేటి అర్థరాత్రి పాక్షిక చంద్ర గ్రహణం
ఆలయ భద్రత కోసం సహకరించాలి
కల్యాణ వెంకన్న ఆలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం
16న చంద్రగ్రహణం: శ్రీవారి ఆలయం మూత