రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వినాయక విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి. శ్రీకృష్ణుడు, బలరాముడు, రాముడు, లక్ష్మీనారసింహుడు, వంటి వివిధ ఆకారాలు, రంగులలో దర్శనమిస్తున్న బొజ్జగణపయ్యలు రాజధాని వ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి. వినాయక చవితి పండుగకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండటం వల్ల విఘ్నేశ్వరులను కొనుగోలు చేసేందుకు కూడా నగర వాసులు పోటీ పడుతున్నారు. అయితే.. ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఇప్పటికే పెరిగిన ధరల కారణంగా, ప్రతిమల తయారీకి ఉపయోగించే ముడి సరుకుల ధరలు కూడా భారీగానే పెరిగాయి. దీంతో వినాయక విగ్రహాల ధరలు గత ఏడాదితో పోల్చితే కాస్త ఎక్కువగానే ఉన్నట్టు ప్రతిమల తయారీదారులు అంటున్నారు. అయినప్పటికీ నగర వాసులు మూషిక వాహనుడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు.
|