తిరుమలలో టిటిడీ ఛైర్మన్ ఆదికేశవులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. టిటిడీ ఈవో కె.వి.రమణారి, ప్రత్యేకాధికారి ఎ.వి.ధర్మారెడ్డిలతో కలసి ఆయన పలు ప్రాంతాల్లో తనిఖీ చేశారు.
బాలాజీనగర్‌లో కౌస్తుభం పేరుతో నిర్మిస్తున్న అతిధి గృహాలను పరిశీలించారు. ఈ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణాల పేరుతో చెట్లను నరకడం కంటే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఆయన కోరారు.
తర్వాక హెచ్‌వీసీ, ఎస్‌ఎస్‌సీ, మాధవ నిలయంలోని భక్తులతో కాసేపు మాట్లాడారు. టిటిడీ కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు.
|