కాణిపాకంలో వెలసిన వరసిద్ధి వినాయకుడికి భక్తులు వజ్రాలు పొదిగిన బంగారు నామాలను సమర్పించుకున్నారు. నెల్లూరుకు చెందిన రామకృష్ణారెడ్డి, పద్మజలు సుమారు 219 గ్రాముల బంగారంతో ఈ నామాలను తయారు చేయించి స్వామివారికి బహుకరించారు.
ఆలయ ఈవో రాజశేఖర్‌కు దాతలు ఆదివారం ఈ నామాలను సమర్పించుకున్నారు. ఈ నామాలను స్వామివారికి నిత్యం అలకరించనున్నామని ఆలయ వర్గాలు తెలిపాయి. వీటి విలువ సుమారు రూ.3 లక్షల వరకు ఉండగలదని అధికారులు అంచనా వేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్‌స్పెక్టర్ విద్యాసాగర్, పాలకమండలి సభ్యులు ప్రవీణ్, రామ్మూర్తినాయుడు, మునిరత్నంరెడ్డి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
|