టీటీడీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు దంపతులను పుట్టపర్తి సత్యసాయిబాబా ఆదివారం ప్రశాంతి నిలయంలో ఆశీర్వదించారు. పాలక మండలి ఛైర్మన్‌గా మహత్తరమైన సేవలు అందించాలని సత్యసాయి ఆదివారం తనను కలుసుకున్న ఆదికేశవులు నాయుడు దంపతులను దీవించారు.
ఈ సందర్భంగా సత్యసాయిబాబా ప్రియ భక్తుడైన ఆదికేశవులునాయుడికి ప్రత్యేకంగా ఆధ్యాత్మిక, ధార్మిక సేవా తత్వాన్ని ఉపదేశించారు. ఈ సందర్భంగా జరిగిన సప్త అర్చక పండితుల వేద పఠన మంత్రోచ్ఛారణలో ఛైర్మన్ దంపతులతో పాటు బాబా కూడా ఆశీస్సులు పొందారు. దైవ సన్నిధిలో భక్తులకు సేవ చేయడం ఓ వరమని బాబా అభివర్ణించారు.
అనంతరం ఆదికేశవులు మాట్లాడుతూ, సత్యసాయి ప్రపంచానికి చేస్తున్న సేవల తరహాలోనే వెంకన్న సన్నిధి ద్వారా సెవలనుఅందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సత్యసాయి భక్తులు, క్రమశిక్షణ కలిగిన వాలంటీర్లను స్ఫూర్తిగా తీసుకుని తాము కూడా అదే తరహాలోనే కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
|