భాద్రపదమాసం అమావాస్య సందర్భంగా ఆదిలాబాద్‌లో నిర్వహించిన రాణీ సతీజీమాత జయంతి ఉత్సవాలు శనివారం ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఉదయం ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు.
పూజలు, అర్చనలు ముగిసిన తర్వాత సామూహిక భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. రాణీసతీజీ ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలో జాగరణ కూడా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి.
|