భాద్రపద అమావాస్య సందర్భంగా చిత్తూరు జిల్లాలోని కాళహస్తీశ్వర దేవాలయంలో భారీ స్థాయిలో సర్పదోష పూజలు జరిగాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు లఘు దర్శనాన్ని అమలు చేశారు.
అమావాస్యనాడు సర్పదోష పూజలతో శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ కారణం చేత ఆలయంలో రికార్డు స్థాయిలో 2340 పూజలు జరిగాయి. వీఐపీలు ఆర్జిత సేవల కారణంగా సాధారణ దర్శనం కోసం భక్తులు రెండు గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది.
|