ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > ముగిసిన రత్నగిరి నరసింహస్వామి జాతర
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ముగిసిన రత్నగిరి నరసింహస్వామి జాతర
కరీంనగర్ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం రత్నగిరి కొండపై వెలసిన నరసింహస్వామి వారి జాతర వైభవంగా ముగిసింది. శ్రావణ మాసం చివరి రోజున స్వామి వారి ఆలయంలో ప్రత్యేక జాతర ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కొండపైన సొరంగం మార్గం ద్వారా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. కొండ శిఖర భాగంలో భక్తులు దీపారాధన చేసి, నైవేధ్యాలు సమర్పించుకున్నారు. కొంత మంది భక్తులు స్వామి వారి పేరుతో అన్నదానం చేశారు.

ఈ ఉత్సవాలకు వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ తదితర జిల్లాల నుంచి సుమారు 30 వేలమంది భక్తులు హాజరయ్యారని అధికార వర్గాలు వెల్లడించాయి.
మరిన్ని
శ్రీకాళహస్తి ఆలయంలో సర్పదోష పూజలు
ముగిసిన రాణీ సతీజీ మాత ఉత్సవాలు
టీటీడీ ఛైర్మన్‌కు సత్యసాయి ఆశీస్సులు
వరసిద్ధి వినాయకుడికి వజ్రాల నామాలు
అమ్మవారికి బంగారు కాసుల హారం
చెన్నైకు 30 వేల శ్రీవారి లడ్డూల సరఫరా