రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలకు రంగం సిద్ధమైంది. ప్రతి ఏటా వేలం వేసే గణేశ్ లడ్డును ఈ ఏడాది కూడా వేలం వేసేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. రాష్ట్ర రాజధానిలోని బాలాపూర్ లడ్డు వేలం కార్యక్రమానికి ముస్తాబయింది. ఈ సందర్భంగా ఆ ప్రాంతమంతా కాషాయ జెండాలు, పోస్టర్లు, సౌండ్ సిస్టంలతో కోలాహలంగా మారింది.
బాలాపూర్ గణేశ్ ఉత్సవ్ కమిటీ అధ్యక్షుడు మధుసూధన్‌రెడ్డీ మాట్లాడుతూ, గణేశ్ లడ్డును వేలం వేసే ఆచారాన్ని రాష్ట్రంలో తొలి సారిగా తమ గ్రామ ప్రజలే ప్రారంభించారని చెప్పారు. ప్రతీ ఏడాది వేలం పాట నిర్వహించు రీతిగానే ఈ ఏడాది కూడా ప్రత్యేక పూజలతో వేడుకలు ప్రారంభం కానుందని తెలిపారు. ఈ లడ్డును అధిక మొత్తంతో ఎవరు కైవసం చేసుకుంటారో వారి ఇంట్లో లక్ష్మీ దేవీ కొలువుంటుందని భక్తుల నమ్మకం అని చెప్పారు.
|