కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. చవితి నుంచి 21 రోజుల పాటు ఈ ఉత్సవాలు సంప్రదాయ బద్ధంగా జరుగనున్నాయి.
ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి, ఆలయ ఛైర్మన్ గల్లా సత్యనారాయణ, ఈవో కేశవులు, పాలకమండలి సభ్యులు గణేష్ దీక్ష చేపట్టి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. స్వామివారి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర మంత్రి చిన్నారెడ్డి స్వామివారిని దర్శించుకుని, వినాయక వ్రతకల్పాన్ని ప్రారంభించారు.
ఉదయం అభిషేకంతో ప్రారంభమై, ప్రత్యేక పూజల తర్వాత సర్వదర్శనానికి వీలు కల్పించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
|