కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం గ్రామోత్సవం జరిగింది. ఇందులో భాగంగా సిద్ధి, బుద్ధి సమేత వినాయకుడికి అభిషేకం నిర్వహించారు.
తర్వాత ప్రత్యేక పూజలు జరిపి, సుందరంగా స్వామివారిని అలంకరించి మేళతాళాలు, బాణాసంచాల మధ్య పల్లకిలో ఊరేగించారు. ఈ ఉత్సవంలో వందలాది మంది భక్తులు పాల్గొని తరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కేశవులు, ఆలయ ఛైర్మన్ గల్లా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
|