ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > అక్టోబర్ 1 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అక్టోబర్ 1 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
అక్టోబర్ 1 నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని తితిదే ఛైర్మన్ డి.కె.ఆదికేశవులు నాయుడు తెలిపారు. ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి వైఎస్, దేవదాయశాఖ మంత్రులను ఆహ్వానించినట్టు ఆయన తెలిపారు.

వినాయక చవితి సందర్భంగా బుధవారం ముఖ్యమంత్రి వైఎస్, దేవదాయశాఖ మంత్రి రత్నాకరరావు, గవర్నర్ తివారీలకు ఆదికేశవులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించగా, ఆయన వచ్చేందుకు అంగీకరించారని చెప్పారు.

అవసరమైన ప్రాంతాల్లో దళిత గోవిందం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. అలాగే కళ్యాణమస్తు కార్యక్రమాన్ని కూడా కొనసాగించనున్నట్టు తెలిపారు.
మరిన్ని
కాణిపాకంలో గ్రామోత్సవం
కాణిపాకంలో వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వేలానికి గణేశ్ లడ్డు సిద్ధం
రంజాన్ నెల ఉపవాసాలు నేటినుంచి ప్రారంభం  
తితిదే పాలకమండలి సభ్యుల ప్రమాణం స్వీకారం
ముగిసిన రత్నగిరి నరసింహస్వామి జాతర