శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వెంకన్నకు స్వర్ణపుష్పార్చన జరిగింది. ఇందులో భాగంగా 108 బంగారు తామర పుష్పాలతో మూలవిరాట్ విగ్రహాల అర్చన జరిపారు.
స్వామివారిని ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో మేల్కొలిపి అనంతరం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 9.45 గంటల సమయంలో అర్చన నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పార్థసారధి నేతృత్వంలో దిగ్విజయంగా జరిగిన ఈ సేవా కార్యక్రమంలో 10 భక్తులు పాల్గొన్నారు.
|