సత్యసాయి బాబా జన్మదినం సందర్భంగా శ్రీకాకుళంలోని కోటబొమ్మాళిలో 83 రోజుల పాటు సాగే దీక్షా కార్యక్రమం కన్నులపండువగా ప్రారంభమయింది.
ఇందులో భాగంగా ముందుగా 108 మంది భక్తులు కొవ్వొత్తులతో కూడిన నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి రోజు అన్నదానం, వస్త్రదాన కార్యక్రమాలను చేపట్టనున్నామని జిల్లా యూత్ కో-ఆర్డినేటర్ అనాదిగుప్త తెలిపారు. ఈ దీక్షా ప్రారంభం కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
|