ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > కాణిపాకంలో కన్నులపండువగా ధ్వజారోహణం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కాణిపాకంలో కన్నులపండువగా ధ్వజారోహణం
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో గురువారం కన్నులపండువగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. స్వామి వారి ఆలయంలో బుధవారం నుంచి ప్రారంభమయిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ధ్వజారోహణాన్ని నిర్వహించారు.

స్వామివారి నక్షత్రం, తులాలగ్నంలో ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య ఉత్సవాలను బ్రహ్మదేవుడు ప్రారంభించారని ప్రత్యేక పూజలు నిర్వహించి మూషికాధ్వజ పటాన్ని ఎగురవేశారు. ఉదయం స్వామి వారి మూలవిరాట్ విగ్రహానికి అభిషేకం నిర్వహించారు.

తర్వాత ధ్వజస్తంభం వద్ద స్థలాన్ని శుద్ధి చేసి, పుణ్యావచనంతో శాంతి జరిపారు. నవసంధి బలితో ప్రారంభించి కలశపూజ, మూషిక యాగాన్ని ఘనంగా నిర్వహించారు. ధ్వజారోహణం చేసిన తర్వాత ప్రత్యేక పూజలు జరిపి, దూపదీప నైవేద్యాలను సమర్పించారు.
మరిన్ని
శ్రీకాకుళంలో సత్యసాయి దీక్షలు ప్రారంభం
వెంకన్నకు 108 స్వర్ణ పుష్పాలతో అర్చన
అక్టోబర్ 1 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
కాణిపాకంలో గ్రామోత్సవం
కాణిపాకంలో వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వేలానికి గణేశ్ లడ్డు సిద్ధం