కల్యాణమస్తుకు దరఖాస్తు చేసుకునే ఆఖరు తేదీని అక్టోబర్ 21గా నిర్ణయించినట్టు టిటిడి ఈవో కే.వీ.రమణాచారి తెలిపారు. నాలుగో విడత కల్యాణమస్తు కార్యక్రమాన్ని నవంబర్ రెండో తేదీన నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.
తిరుమలలో శుక్రవారం ఉదయం డయల్ యువర్ ఈవో పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత కళ్యాణమస్తు కార్యక్రమంపై విస్తృతమైన ప్రచారం సాగిస్తామని చెప్పారు.
వీటికి సంబంధించిన దరఖాస్తు పత్రాలు టీటీడీ కళ్యాణ మండపాలు, విచారణ కార్యాలయాల్లో, డీపీసీ కో-ఆర్డినేటర్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో లభిస్తాయని ఆయన తెలిపారు.
|