ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > కాణిపాకం వినాయకుడికి బంగారు రథం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కాణిపాకం వినాయకుడికి బంగారు రథం
కాణిపాకంలోని వరసిద్ధి వినాయకుడికి బంగారు రథం తయారు చేసే అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం సానుకూలంగా స్పందించింది. ఈ అంశానికి సంబంధించి గతంలో కాణిపాకం పాలక మండలి తితిదేని కలిసి చర్చించింది.

స్వామి వారి బంగారు రథం కోసం సుమారు రూ.4 కోట్ల 50 లక్షలు ఖర్చు అవుతుందని అధికారా వేశారు. తితిదే పాలక మండలి కొత్త ఛైర్మన్‌గా ఆదికేశవులు బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయనను కాణిపాకం పాలక మండలి కలిసి చర్చలు జరిపింది.

వెంటనే స్పందించిన ఆదికేశవులు రథం కోసం కేటాయించిన నగదు, బంగారం, వెండి తదితరాలను తితిదేకు అప్పగిస్తే ఆరు నెలల కాలంలో రథాన్ని తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మరిన్ని
కల్యాణమస్తు గడువు అక్టోబర్ 21 వరకు
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తితిదే అధికారుల సమీక్ష
భక్తిశ్రద్ధలతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు  
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గద్వాల పంచెలు
కాణిపాకంలో కన్నులపండువగా ధ్వజారోహణం
శ్రీకాకుళంలో సత్యసాయి దీక్షలు ప్రారంభం