తిరుపతిలో ఈ నెల 11న జరుగనున్న మహిళా సదస్సుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు పాల్గొంటున్న ఈ సదస్సుకు చిత్తూరు జిల్లా నుంచే దాదాపు రెండు లక్షల మంది వరకు వచ్చే అవకాశం ఉందని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలిపారు.
తిరుపతిలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ విషయాలు తెలిపారు. సోనియా గాంధీ ఇకపై తరచుగా రాష్ట్రంలో పర్యటించేలా కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. 45 రోజులకు ఒకసారి ఆమె రెండు జిల్లాల్లో పర్యటిస్తారని తెలిపారు.
ఈ మహిళా సదస్సు అధికార కార్యక్రమం కావడం చేత పార్టీ కార్యకర్తలు హాజరుకారని తెలిపారు. వేదికపై తనతో పాటు ముఖ్యమంత్రి వైఎస్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ, సంబంధిత మంత్రులు మాత్రమే ఉంటారని చెప్పారు.
|