ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > పద్మావతి అమ్మవారికి బంగారు హస్తాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పద్మావతి అమ్మవారికి బంగారు హస్తాలు
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి ఓ భక్తుడు ఆదివారం బంగారు హస్తాలను సమర్పించుకున్నాడు. బెంగళూరుకు చెందిన కమల్‌కడియా రూ.15 లక్షలతో నాలుగు హస్తాలను చేయించాడు.

ఇందులో ఒకటి అభయహస్తం కాగా, మరొకటి వరదహస్తం, రెండు కమల హస్తాలు, వెంకటేశ్వర స్వామి డాలర్‌తో కూడిన చైన్లు ఉన్నాయని ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆభరణాలను ఆదివారం ఉదయం ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో చెంగల్‌రాయులకు దాత అందించారు. ఈ హస్తాలను అమ్మవారి ఉత్సవమూర్తులకు అలంకరించనున్నట్టు ఆలయ అధికారులు చెప్పారు.
మరిన్ని
తిరుపతి సభకు భారీగా ఏర్పాట్లు
నెమలి వాహనంపై వరసిద్ధి వినాయకుడు
కాణిపాకం వినాయకుడికి బంగారు రథం
అక్టోబర్ 21 వరకు కల్యాణమస్తు గడువు
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తితిదే అధికారుల సమీక్ష  
భక్తిశ్రద్ధలతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు