ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > నేపాల్‌లో గణపతికి 175 కిలోల లడ్డు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నేపాల్‌లో గణపతికి 175 కిలోల లడ్డు
గణేశ్ ఉత్సవాల్లో భాగంగా నేపాల్‌లోని గణపతికి భారీ లడ్డును సమర్పించారు. నేపాల్‌ దక్షిణంలో ఉన్న బిర్‌గంజ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి 175 కిలోల లడ్డును నిర్వాహకులు నైవేద్యం పెట్టారు. దీనిని సోమవారం భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు.

గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధి మదన్‌ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి ఏటా తాము గణేశ్ ఉత్సవాల్లో భాగంగా ఈ తరహాలోనే లడ్డును తయారు చేస్తామని చెప్పారు. అయితే ఈ ఏడాది కాస్త భారీగా తయారు చేశామని తెలిపారు. ముగ్గురు వ్యక్తులు 17 గంటల పాటు శ్రమించి ఈ లడ్డును తయారు చేశారని ఆయన వెల్లడించారు.
మరిన్ని
రూ.2 లక్షల 7 వేలు పలికిన గణేశ్ లడ్డు
పద్మావతి అమ్మవారికి బంగారు హస్తాలు
తిరుపతి సభకు భారీగా ఏర్పాట్లు
నెమలి వాహనంపై వరసిద్ధి వినాయకుడు
కాణిపాకం వినాయకుడికి బంగారు రథం
అక్టోబర్ 21 వరకు కల్యాణమస్తు గడువు