ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > శ్రీవారి ఆలయంలో మంగళ కైశిక ద్వాదశి మహోత్సవం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
శ్రీవారి ఆలయంలో మంగళ కైశిక ద్వాదశి మహోత్సవం
FILE
శ్రీవారి ఆలయంలో ఈ నెల 10వ తేదీ మంగళ కైశిక ద్వాదశి మహోత్సవం వైభవంగా జరుగనుంది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా... మంగళ ధ్వని, స్వామివారికి నిత్యార్చనం, శ్రీ వేంకటేశ్వర హోమాలను కూడా జరుగనున్నాయి. హరిదాస భాగవతులతో మంగళ కైశిక ద్వాదశి వ్రత కథాగానం, అన్నమాచార్య సంకీర్తనం, సమిష్టి గోవిందనామస్మరణం, సహపంక్తి భోజనాలు వంటి కార్యక్రమాలను హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిర్వహించనుంది.

ఇకపోతే.. రాష్ట్రంలో ఎంపిక చేయబడిన 108 దళిత వాడల్లో కార్తీక మాస శుక్ల ద్వాదశిన ఈ కార్యక్రమాన్ని తితిదే నిర్వహిస్తోంది. మాలదాసరులుగా పిలువబడే హరిదాస సంస్కృతి వైభవాన్ని చాటేందుకు గానూ... గత ఏడాది నుంచి టీటీడీ ఈ ఉత్సావానికి శ్రీకారం చుట్టింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
తిరుమల కొండపై వెలసిన వినాయకుడు
ప్రైవేటు చేతిలో టీటీడీ కళ్యాణ మండపాలు
కన్నులపండువగా శ్రీవారి పుష్పయాగం
తిరుమలలో శ్రీవారికి పుష్పయాగ సేవ
లక్ష్మీ నృసింహుని నిత్య బ్రహ్మోత్సవాలు
గోష్పాద క్షేత్రంలో ఘనంగా "శ్రీయాగం"