ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > ఘనంగా "కైశిక ద్వాదశి" మహోత్సవాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఘనంగా "కైశిక ద్వాదశి" మహోత్సవాలు
FILE
తిరుమలలో ప్రతి ఏటా జరిగే కైశిక ద్వాదశి మహోత్సవాలు సోమవారం వైభవంగా జరిగాయి. సూర్యోదయానికి ముందే అభిషేకం పూర్తి చేసుకున్న వెంకన్న తన సతీమణులైన శ్రీ దేవీ, భూదేవీలతో సర్వాలంకరణ భూషితుడై ఉగ్ర నరసింహ అవతారంలో తిరుమాడ వీధుల్లో వైభవంగా ఊరేగారు. అనంతరం పూజారులు తిరిగి ఊజ్వల మూర్తిని ఆలయంలోకి తీసుకెళ్లారు.

మలయప్ప స్వామి దివ్యపురుషుడిగా మాడవీధుల్లో ఊరేగిన వైనాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తిరుమలకు తరలి వచ్చారు.

కాగా... తితిదే ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 108 దళిత మండలాల్లో ఈ కైశిక ద్వాదశి మహోత్సవాలు జరుగనున్నాయి.

దాసభక్తి", "మాల దాసరులు" పేరిట నిర్వహించబడిన ఒకప్పటి హిందూ సాంస్కృతిక కార్యక్రమాలను పునరుద్ధరించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నడుం బిగించింది.

ఇందులో భాగంగా... తితిదేకు అనుబంధమైన హిందూ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 23 జిల్లాలలో 108 కేంద్రాలలో నవంబర్ 21న మంగళ కైశిక ద్వాదశిని నిర్వహించనుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
సింహగిరిపై సుదర్శన నృసింహయాగం
పంచారామ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
శ్రీవారి ఆలయంలో మంగళ కైశిక ద్వాదశి మహోత్సవం
తిరుమల కొండపై వెలసిన వినాయకుడు
ప్రైవేటు చేతిలో టీటీడీ కళ్యాణ మండపాలు
కన్నులపండువగా శ్రీవారి పుష్పయాగం