ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > అంగరంగ వైభవంగా నృసింహ యాగం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అంగరంగ వైభవంగా నృసింహ యాగం
FILE
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన సింహాచలం వరాహ నృసింహస్వామి దేవాలయంలో లోకకళ్యాణార్థం నిర్వహిస్తున్న సుదర్శన నృసింహ యాగం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం త్రిదండి చిన జీయర్ స్వామి పర్యవేక్షలో సంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తున్న ఈ యాగంలో సుమారు 350కి పైగా రుత్వికులు పాల్గొన్నారు.

108 హోమకుండలాల్లో వైభవంగా జరిగిన ఈ యాగం మంగళాశాసనముతో ప్రారంభమైంది. ఉత్సవమూర్తులను యాగశాల ప్రవేశం చేసి, అనంతరం అగ్నిమధనాన్ని చేపట్టారు. యాగశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా రూపొందించిన ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు.

హోమకుండలాల్లో అగ్నిమధనం చేపట్టిన తర్వాత... శాంతిపాఠం, పారాయణాలు నిర్వహించారు. ఈ యాగం పూర్తయిన అనంతరం స్వామివారి తీరువీధి సేవను చేపట్టారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వేలాది మంది భక్తులు నరసింహస్వామికి దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో స్వామివారికి ఉయ్యాల సేవను సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు.

అనంతరం మంగళశాసనములు పూర్తిచేసి ఉత్సవమూర్తులను ఆలయంలోకి తీసుకెళ్లి పవళింపు సేవను చేపట్టారు. ఈ సుదర్శన యాగాన్ని పురస్కరించుకుని సింహగిరి భక్త జనంతో కిటకిటలాడింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
తిరుమల గర్భాలయ పూజలు ప్రత్యక్ష ప్రసారం
ఘనంగా "కైశిక ద్వాదశి" మహోత్సవాలు
సింహగిరిపై సుదర్శన నృసింహయాగం
పంచారామ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
శ్రీవారి ఆలయంలో మంగళ కైశిక ద్వాదశి మహోత్సవం
తిరుమల కొండపై వెలసిన వినాయకుడు