ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > మలయప్ప స్వామికి గరుడోత్సవం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మలయప్ప స్వామికి గరుడోత్సవం
FILE
శ్రీ వేంకటేశ్వర స్వామికి గురువారం గరుడోత్సవం వైభవంగా జరుగనుంది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తితిదే ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. రాత్రి ఏడు గంటలకు స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగేందుకు సర్వం సిద్ధమైంది.

కార్తీక పున్నమిని సందర్భంగా శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం కూడా ఘనంగా జరుగనుంది. శ్రీనివాసునికి గురువారం సాయంత్రం కైంకర్యాదులు నివేదనలు పూర్తయిన తర్వాత దీపోత్సవం జరుగుతుందని తితిదే విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇకపోతే... వెంకన్న స్వామి శ్రీదేవీ, భూదేవీ సమేతంగా గరుడవాహనంపై ఆసీనులై తిరుమాడవీధుల్లో ఊరేగనున్న వైనాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
భక్తులతో పోటెక్కిన శైవక్షేత్రాలు
భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు
శ్రీవారికి విలువైన కెంపు కిరీటం, హారాలు
ఘనంగా అరసవల్లి ఆదిత్యుని తెప్పోత్సవం
కలిగిరిలో వైభవంగా కైశిక మహోత్సవం
అంగరంగ వైభవంగా నృసింహ యాగం