ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > వరసిద్ధి వినాయకునికి అన్నాభిషేకం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వరసిద్ధి వినాయకునికి అన్నాభిషేకం
FILE
కార్తీక పౌర్ణమి సందర్భంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి అన్నాభిషేకం ఘనంగా జరిగింది. కార్తీకమాసంలో ప్రతి ఏటా స్వామివారికి వైభవంగా అన్నాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. అన్నాలంకృతుడైన బొజ్జప్పను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

బుధవారం ఉదయం మూలవిరాట్ట స్వామికి సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని అన్నంతో దివ్య సుందరంగా అలంకరించారు. అలంకరణ తర్వాత వినాయక స్వామికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.

అన్నాభిషేకం పూర్తయిన తర్వాత విఘ్నేశ్వరునికి ఘనంగా ఊంజల్ సేవ జరిగింది. సిద్ధి, బుధ్ధి సమేతుడైన వరసిద్ధి వినాయకునిని సర్వాలంకరణాభూషితుడుగా అలంకరించి అన్వేటి మండపంలో ఏర్పాటు చేసిన ఊయలలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మలయప్ప స్వామికి గరుడోత్సవం
భక్తులతో పోటెక్కిన శైవక్షేత్రాలు
భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు
శ్రీవారికి విలువైన కెంపు కిరీటం, హారాలు
ఘనంగా అరసవల్లి ఆదిత్యుని తెప్పోత్సవం
కలిగిరిలో వైభవంగా కైశిక మహోత్సవం