పుట్టపర్తిలో శనివారం సత్యసాయి సహస్ర పూర్ణ చంద్ర దర్శన యజ్ఞం ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రత్యేక వేదికతో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ యజ్ఞాన్ని వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారానికి కూడా రంగం సిద్ధమైందని పుట్టపర్తి మందిరం నిర్వాహకులు వెల్లడించారు.ఈ యజ్ఞంలో టీటీడీ ఛైర్మన్ ఆదికేశవులు, ట్రస్టు కార్యదర్శి చక్రవర్తి తదితరులు పాల్గొంటున్నారు. ఇంకా ట్రస్టు సభ్యులు బెంగుళూరు శ్రీనివాసులు యజ్ఞ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులు యజ్ఞాన్ని దర్శించేందుకు వీలుగా వాహనాల రాకపోకలను సజావుగా సాగేలా ట్రస్టు నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. మహిళలకు, పురుషులకు వేర్వేరు గేట్లను అమర్చినట్లు ట్రస్టు అధికారులు తెలిపారు. ముఖ్య అతిథుల కోసం గ్యాలరీలను, భక్తులకు కోసం కార్పెట్లు కూడా సిద్ధం చేశారు. |