ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > ఉత్తిరమేరూర్ కుమారస్వామికి వెండిరథం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఉత్తిరమేరూర్ కుమారస్వామికి వెండిరథం
తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లా చెంగల్పట్టు సమీపంలోని ఉత్తిర మేరూర్‌లో వెలసిన బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 260 కిలోల వెండి రథం సిద్ధమైంది. చెన్నై నగరంలోని ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ జీఆర్‌టీ నిర్వాహకులు ఈ వెండిరథాన్ని కుమారస్వామికి బహూకరించనున్నట్లు తెలిపారు.

ఈ రథాన్ని ఐదుగురు వడ్రంగులు, తొమ్మిది మంది స్వర్ణకారులు తయారు చేశారు. తొమ్మిదిన్నర అడుగుల ఎత్తులో ఈ వెండిరథం తయారైందని సంస్థ నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ వెండిరథ తయారీకి రూ.50లక్షలు పైగా వ్యయమైందని సమాచారం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
పుట్టపర్తిలో పూర్ణ చంద్ర దర్శన యజ్ఞం
వరసిద్ధి వినాయకునికి అన్నాభిషేకం
మలయప్ప స్వామికి గరుడోత్సవం
భక్తులతో పోటెక్కిన శైవక్షేత్రాలు
భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు
శ్రీవారికి విలువైన కెంపు కిరీటం, హారాలు