భారతీయులందరిదీ ప్రేమ మతంగా సత్యసాయిబాబా అభివర్ణించారు. మతాలు వేరైనా అందరూ ఆరాధించే మాధవుడు ఒక్కడేనని బాబా ఉద్భోధించారు. ప్రశాంతి నిలయంలో గురువారం రాత్రి నూతన సంవత్సర వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులకు బాబా సందేశం ఇచ్చారు. శాంతి, ప్రేమ, అహింస, సత్య, ధర్మ అనే సనాతన ధర్మాలు సమైక్యతకు నాందిగా బాబా పేర్కొన్నారు. అశాంతి, అసమానతలతో నేడు ప్రపంచం రగిలిపోతున్న నేపథ్యంలో... సమైక్యత, శాంతి ఆవశ్యకతను గురించి బాబా భక్తులకు వివరించారు. యజ్ఞాల ద్వారా మాత్రమే దేవుడిని ఆరాధించడం కాదని, నిర్మలమైన మనసుతో భగవంతుడిని ఆరాధిస్తే ప్రతి మనిషి మనసు నుంచి దివ్యత్వం ఆవిర్భవిస్తుందని బాబు బోధించారు. |