హిందూ ధర్మ సంస్థాపనే తమ లక్ష్యమని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ అన్నారు. విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ సభలో ఆయన ప్రసంగిస్తూ... భారత్ నుంచి కాశ్మీర్‌ను వేరు చేయడమే లక్ష్యంగా జీహాద్ పేరిట ఉగ్రవాదులు విధ్వంసం సృష్టిస్తున్నారని గుర్తుచేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను మట్టికలిపేందుకు ఇటీవల ఉగ్రవాదులు ముంబై దాడులకు పాల్పడ్డారని సింఘాల్ వెల్లడించారు. కాశ్మీర్ వివాదాన్ని ఉగ్రవాదం చేస్తున్న శక్తులను అంతమొందించాలని సింఘాల్ పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలోని వన్‌నెస్ టెంపుల్‌లో ఆదివారం వీహెచ్‌పీ అంతర్జాతీయ సభను నిర్వహించింది. ఈ సభలో ప్రసంగించిన వక్తలందరూ సంపూర్ణ హిందూ ధర్మసంస్థాపనే లక్ష్యమని ఉద్ఘాటించారు. |