వెంకన్న ఆలయానికి తరలివస్తున్న అశేష భక్తజనంతో ప్రతి నిత్యం శ్రీవారి హుండీ నిండి తొణుకుతున్న సంగతి అందరికీ తెలిసిందే. రాబడి విషయంలో మొదటి స్థానంలో మలయప్ప స్వామి ఆలయం నిలవగా... రెండో స్థానాన్ని మహారాష్ట్రలోనికి సుప్రసిద్ధ షిర్డీ సాయిబాబా ఆలయం సొంతం చేసుకుంది. అత్యంత రాబడి గల దేవాలయంగా తిరుమల తర్వాత షిర్డీయేనని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. గత సంవత్సరంలో రూ. 81 కోట్ల నగదుతో పాటు 920 కిలోల బంగారం, 440 కిలోల వెండి నిధుల రూపంలో ఆలయానికి చేరిందని షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు అధికారులు తెలిపారు. డిసెంబర్ 29, 2008 నుంచి జనవరి ఆరోతేదీవరకు హుండీ ఆదాయం రూ. 4.15 కోట్లని ట్రస్టు తెలియజేశారు. ఈ నిధులతో రోడ్లు, భవనాలు, ఆసుపత్రులు నిర్మిస్తున్నామని, ప్రసాదాలయాన్ని కూడా నిర్మించామని వారు పేర్కొన్నారు. గత 2007వ సంవత్సరంలో కూడా షిర్డీ ఆలయానికి 100 కిలోల పైగా బంగారం వచ్చిందని ట్రస్టు అధికారులు వెల్లడించారు. |