ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > శ్రీశైలంలో ఘనంగా ముగిసిన గ్రామోత్సవం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
శ్రీశైలంలో ఘనంగా ముగిసిన గ్రామోత్సవం
FILE
సుప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఈ రోజు బృంగీవాహనంపై శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి దివ్య సుందరంగా ఊరేగుతూ.. భక్తులకు అభయప్రదానం చేశారు.

ఆలయ ప్రాంగణంలో బృంగీ వాహనంపై స్వామివారు, అమ్మవార్లను అధిష్టింపజేసి పంచహారతులను సమర్పించారు. అనంతరం ఉత్సవమూర్తుల ఆలయ ప్రదక్షిణ వైభవోపేతంగా జరిగింది. రాజగోపురాల గుండా ఆలయ పురవీధుల్లో ఈ గ్రామోత్సవాన్ని నిర్వహించారు.

ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు శ్రీశైలం తరలివచ్చారు. దేవేరితో ఆలయ వీధుల్లో ఊరేగిన మల్లికార్జున స్వామిని భక్తకోటి భక్తిశ్రద్ధలతో కొలిచి, స్వామివారి ఆశీస్సులను పొందారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
వెంకన్న ఆలయంలో "నిమ్మకాయల ఉత్సవం"
శ్రీశైలమహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
రెండో స్థానంలో షిర్డీ సాయిబాబా ఆలయం
ఘనంగా ముగిసిన గంధ మహోత్సవం
ఆయన తితిదే ఛైర్మన్ కాదు.. ఓ క్లర్క్!
అమెరికాలో అయ్యప్ప పూజ