ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం
FILE
తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం మీనలగ్న ముహూర్తంలో వైభవంగా ధ్వజారోహణంతో ఈ ఉత్సవాలు ఆరంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల మధ్య వృషభ సంకేతాన్ని ధ్వజస్తంభంపైకి ఆరోహణం చేశారు. పాలు, పెరుగు, చందనం, పంచ ఫల రసాలతో ధ్వజస్తంభానికి త్రిశూలానికి అభిషేకం చేశారు. తర్వాత దీపారాధన గావించారు. అనంతరం స్వామివారికి పల్లకి ఉత్సవం జరిగింది.

ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. భోళాశంకరుడు హంసవాహనంపై ఊరేగారు. సోమవారం రాత్రి స్వామివారిని, కామాక్షి అమ్మవారిని పుష్పాలు, వివిధ స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలతో అలంకరించారు. దివ్య సుందరంగా అలంకృతమైన శంకరుడు పల్లకిలో ఆసీనులై ఆలయ వీధుల్లో ఊరేగగా, అమ్మవారు మరో పల్లకిలో స్వామిని అనుసరించారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీ కాళహస్తి సిద్ధం
మల్లన్న క్షేత్రంలో ఘనంగా ధ్వజారోహణం
పెద్ద శేష వాహనంపై ఊరేగిన కళ్యాణ వెంకన్న
శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వైభవోపేతంగా కళ్యాణ వెంకన్న ధ్వజారోహణం
సీఆర్వో వద్ద శ్రీవారి సేవా టిక్కెట్ కౌంటర్లు