శ్రీనివాసమంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం వెంకన్న స్వామి కృష్ణమూర్తి స్వరూపంలో చిన్నశేష వాహనంపై ఆలయ వీధుల్లో విహరించారు. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన సోమవారం రాత్రి జరిగిన ఈ ఊరేగింపును భక్తకోటి కనులారా తిలకించి పరవశులైయ్యారు.అదేవిధంగా సోమవారం రాత్రి కలియుగ ప్రత్యక్ష దైవమైన మలయప్ప స్వామి సరస్వతి రూపంలో హంసవాహనంపై కొలువుదీరి తిరు వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. చిన్నశేష వాహనం ఊరేగింపుకు అనంతరం కళ్యాణ మండపంలో స్వామి వారి ఉత్సవమూర్తులకు సౌగంధికా పుష్పద్రవ్యమాలికలతో స్నపన తిరుమంజన సేవలు జరిగాయి. |