ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > శ్రీకాళహస్తిలో ఘనంగా ధ్వజారోహణం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
శ్రీకాళహస్తిలో ఘనంగా ధ్వజారోహణం
FILE
సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ కాళహస్తిలో ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా జరుగనుంది. పండితుల వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య శ్రీకాళహస్తీశ్వరుని ధ్వజారోహణ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ నెల 23వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని కన్నుల పండుగగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 24వ తేదీన రథోత్సవం, 25న కళ్యాణోత్సవం జరుగుతుంది. చివరిగా మార్చి రెండోతేదీన జరిగే ఏకాంత సేవతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

ఇదిలా ఉండగా... భక్తకన్నప్ప ధ్వజారోహణంతో శ్రీ కాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు బుధవారం అంకురార్పణ జరిగింది. భక్తకన్నప్పతో పాటు, స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా కైలాసగిరుల మీద గల భక్తకన్నప్ప కొండమీదకు తీసుకెళ్లారు. అక్కడ ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించి, స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ప్రేమతో చేసే సేవలు అమూల్యమైనవి
మయూర వాహనంపై విహరించిన మల్లన్న
శ్రీ కాళహస్తిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు
చిన్నశేష వాహనంపై ఊరేగిన కళ్యాణ వెంకన్న
కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం
శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీ కాళహస్తి సిద్ధం