మహాశివరాత్రి పర్వదినాన్నిపురస్కరించుకుని ప్రముఖ శైవ క్షేత్రాలైన శ్రీశైలం, కాళహస్తీశ్వరాలయాల్లో రథోత్సవం వైభవంగా ముగిసింది. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా, మల్లన్న క్షేత్రమైన శ్రీశైలంలో మంగళవారం శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా దేవి వార్ల రథోత్సవం అంబరాన్నంటింది.ఉత్సవమూర్తులను వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ పల్లకీలో ఊరేగిస్తూ.. రథశాల వద్దకు చేర్చారు. ముక్కంటి రథం కదలగానే శివనామస్మరణలతో మల్లన్న క్షేత్రం మారు మ్రోగింది.ఇదేవిధంగా.. శ్రీ కాళహస్తీశ్వరాలయంలో జరిగిన రథోత్సవం భక్తజనానికి నేత్రానందం కలిగించింది. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీకాళహస్తిలో స్వామి, అమ్మ వార్ల రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ రథోత్సవంలో వేలాది మంది భక్తులు భోళాశంకరుడిని దర్శించుకుని తరించారు. |