శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. పుష్పయాగోత్సవం శుక్రవారం రాత్రి ఘనంగా జరుగనుంది. అనంతలోని కదిరిలో వెలసని నరసింహ స్వామికి, బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజున ఈ పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. దీని ప్రకారం ఆలంయలోని యాగశాలలో శుక్రవారం రాత్రి ఈ పుష్పయాగాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ ఉత్సవానికి ఉభయదారులుగా పూల అశ్వర్థనారాయణ కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే రాత్రి శ్రీవారిని ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి ఏకాంత సేవ నిర్వహించనున్నారు. ఇకపోతే.. ఉదయం నవ కలశ ప్రతిష్ట, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు పూర్తయిన తర్వాతే శ్రీ వారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారని ఆలయ నిర్వాహకులు అన్నారు. |