తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్య 601 జయంతిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో.. ఆదివారం లక్షగళ సంకీర్తనార్చన వైభవంగా జరుగనుంది. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగనున్న ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొననున్నారు.ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమం రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ఇందులో మొత్తం ఏడు కీర్తనలను ఆలపిస్తారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సిలికానాంధ్రలతో తితిదే సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ లక్షగళార్చనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తుల సౌకర్యార్థం జిల్లాల వారీగా బ్లాకులను ఏర్పాటు చేసినట్లు తితిదే విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఒక్కొక్క బ్లాక్‌లో కనీసం 2500 మంది కూర్చుంటారని తితిదే అధికారులు ఆ ప్రకటనలో తెలియజేశారు. |