ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > అన్నమయ్య విగ్రహంపై పుష్ప వర్షం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అన్నమయ్య విగ్రహంపై పుష్ప వర్షం
FILE
కడప జిల్లా తాళ్లపాకలోని 108 అడుగుల అన్నమయ్య విగ్రహంపై పువ్వుల వర్షం కురిపించారు. అన్నమయ్య 601 జయంత్యుత్సవాల్లో రెండో రోజైన ఆదివారం అన్నమయ్య విగ్రహంపై హెలికాప్టర్‌తో పువ్వుల వర్షం కురిపించడం భక్తులను కనువిందు చేసింది.

ఈ ఉత్సవాలకు భారీ సంఖ్య భక్తులు తరలి వస్తున్నారు. టీటీడీ ప్రత్యేకంగా రప్పించిన డెక్కన్ ఏవియేషన్ సంస్థకు చెందిన హెలికాప్టర్ అన్నమయ్య విగ్రహంపై పుష్ప వర్షం కురిపించింది.

అన్నమయ్య జయంత్యుత్సవాల్లో భాగంగా... ఆదివారం సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు టీటీడీ అర్చకులు తిరుమలేశునికి ఊంజల్ సేవను నిర్వహించారు.

అన్నమయ్య విగ్రహం వద్ద సాగిన ఈ వేడుకను తిలకించేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. సర్వాలంకరణాభూషితుడైన శ్రీవారు, దేవేరులతో కలిసి ఊంజల్‌పై ఆసీనులైన సుందర దృశ్యాన్ని వీక్షించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
గిన్నిస్ రికార్డుకెక్కిన "లక్ష గళ సంకీర్తనార్చన"
సికింద్రాబాద్‌లో "లక్ష గళ సంకీర్తనార్చన"
తాళ్లపాకలో అన్నమయ్య జయంత్యుత్సవాలు ప్రారంభం
యాదగిరిలో నృసింహ జయంత్యుత్సవాలు ప్రారంభం
బ్రహ్మంగారి రథోత్సవ వేడుకలు
తిరుచానూరులో నిత్య అన్నదాన పథకం: తితిదే