ప్రసిద్ధ శైవక్షేత్రం రామేశ్వరాలయానికి ఓ విదేశీ మహిళ భారీ విరాళం అందించారు. తమిళనాడులోని రామేశ్వరాలయానికి ఎలిజిబెత్ అనే మహిళ రూ.2.07 కోట్ల చెక్‌ను పంపారు. ప్రతిరోజు తన పేరు మీద భక్తులకు రామేశ్వరుని ప్రసాదం పంచి పెట్టాలని ఆమె దేవస్థానం నిర్వాహకులను కోరారు.రామేశ్వరుని మహిమను ఎవరో చెప్పి విన్న ఎలిజిబెత్, ప్రతీఏటా తప్పనిసరిగా ఈ ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించి భక్తులకు ఉచితంగా భోజనాలు పెట్టిస్తుందని దేవస్థానం అధికారులు వెల్లడించారు. తాజాగా ఆలయ పునరుద్ధరణ కోసం రూ. 20 కోట్ల సహాయం అవసరమని ఆలయ బోర్డు భక్తుల వద్ద విరాళాలను కోరింది. ఈ విషయం తెలుసుకున్న ఎలిజెబత్ రెండు కోట్ల రూపాయల చెక్‌ను దేవస్థానానికి పంపినట్లు ఆలయ నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. |