ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > 30నుంచి గోవిందరాజుని బ్రహ్మోత్సవాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
30నుంచి గోవిందరాజుని బ్రహ్మోత్సవాలు
FILE
తిరుపతిలో వెలసిన శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 30వ తేదీ నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. శనివారం (30వ తేదీ) ఉదయం మిధున లగ్నంలో నిర్వహించే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభమౌతాయి.

ఈ నెల 30 నుంచి జూన్ 7వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా.. 30వ తేదీ సాయంత్రం 8 గంటలకు పెద్ద శేష వాహనంలో స్వామివారు తిరుమాడవీధుల్లో ఊరేగుతారు. 31వ తేదీ ఉదయం చిన్న శేషవాహనం, రాత్రి 8 గంటలకు హంసవాహన సేవలు ఘనంగా జరుగనున్నాయి.

ఇకపోతే.. జూన్ ఒకటోతేదీ ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరి, 2వ తేదీ కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, 3వ తేదీ ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి గరుడ సేవను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

అదేవిధంగా.. జూన్ నాలుగో తేదీ ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు వసంతోత్సవం, రాత్రి 8 గంటలకు గజవాహన సేవ జరుగుతుంది.

ఐదో తేదీ సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు, ఆరోతేదీ ఉదయం రథోత్సవం, రాత్రి 8 గంటలకు అశ్వవాహనం, చివరి రోజైన ఏడో తేదీ ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి 8 బంగారు తిరుచ్చి వాహనం, రాత్రి 9.10 గంటలకు ధ్వజారోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ అధికారులు ఆ ప్రకటనలో తెలిపారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం
ముగిసిన వేణుగోపాలుడి బ్రహ్మోత్సవాలు
నిత్యాన్నదాన పథకానికి 6100 డాలర్ల విరాళం
భక్తులతో కిటకిటలాడుతోన్న వెంకన్న ఆలయం
31న విజయవాడలో భజగోవిందం
భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల