అభా అఖాడా పరిషత్ హరిద్వార్‌లో 2010లో జరిగే మహాకుంభమేళాకు సంబంధించి పవిత్రమైన స్నానాల తిథుల(తేదీలు)ను ప్రకటించింది.
మహాకుంభమేళాకు సంబంధించిన ప్రధానమైన పవిత్ర స్నానం రానున్నసంవత్సరం(2010)లో ఏప్రిల్ నెల 14న ప్రారంభమౌతుందని ఆ సంస్థ ఓ ప్రకటనలో ప్రకటించింది. అదే తొలి అధికారిక స్నానం మహాశివరాత్రిరోజు అంటే ఫిబ్రవరినెల 12వ తేదీన వస్తుంది.
రెండవ అధికారిక స్నానం మార్చినెల 15వ తేదీన వస్తుంది. మూడవ అధికారిక స్నానం వైశాఖ కృష్ణపక్షం అమావాస్య రోజున ఏప్రిల్ 14వ తేదీన, అలాగే నాల్గవ చివరి అధికారిక స్నానం ఏప్రిల్ నెల 30వ తేదీన వస్తుందని పరిషత్ ప్రకటించింది.
ఇదిలావుండగా తొలి రెండు స్నానాలలో సన్యాసులు, ఋషులు, మునులు స్నానమాచరిస్తారు. మిగిలిన రోజుల్లో సాధారణ ప్రజలు స్నామాచరిస్తారని పరిషత్ తెలిపింది. |