కలియుగ వైకుంఠం, తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వారాంతం కావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 28 క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. క్యూకాంప్లెక్స్‌లకు బయట సుమారు రెండు కిలోమీటర్ల మేర క్యూలైన్లు వ్యాపించాయి. పెరుగుతున్న రద్దీ కారణంగా తితిదే సెల్లార్ దర్శనాన్ని రద్దు చేసింది. దీంతో పాటు తితిదే అధికారులు మహాలఘు దర్శనాన్ని కొనసాగిస్తున్నారు. ఇకపోతే.. శనివారం భక్తుల రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుందని తితిదే అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం శ్రీవారిని దర్శించుకునేందుకు 10 గంటల సమయం పడుతుంది. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తితిదే అధికారులు ఆ ప్రకటనలో వెల్లడించారు. |