కలియుగ ప్రత్యక్షదైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి కానుకలు వెల్లువల్లా వస్తున్నాయి. ఇటీవల వెంకన్నకు కర్ణాటక మంత్రి గాలి జనార్థన రెడ్డి వజ్ర కిరీటాన్ని బహూకరించిన సంగతి తెలిసిందే. తాజాగా వెంకన్న స్వామివారికి కానుకగా రూ.15లక్షల విలువచేసే స్వర్ణపాత్రను అహోబిల మఠాధిపతి సేవన్ శఠగోపనారాయణ యతీంద్ర మహాదేశికన్, ఉత్తరాధిపతి రంగనాథ యతికన్ దేశికన్‌లు ఆదివారం టీటీడీ ప్రత్యేకాధికారి ధర్మారెడ్డికి అందజేశారు.ఈ స్వర్ణ పాత్రను ప్రతిరోజు రాత్రి ఆలయంలో నిర్వహించే ఏకాంత సేవాకార్యక్రమంలో వినియోగిస్తారు. శ్రీవారి దర్శనార్థం ఆదివారం తిరుమలకు వచ్చిన అహోబిల మఠాధిపతులు, తమ శిష్యగణానికి చెందిన బెంగళూరు భక్తుడొకడు విరాళంగా సమర్పించిన స్వర్ణపాత్రను తితిదేకు అందజేశారు.ఇదిలా ఉండగా.. కర్ణాటక రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గాలి కరుణాకర్ రెడ్డి ఆదివారం శ్రీ కాళహస్తీశ్వరునికి నవగ్రహ స్వర్ణ కవచాన్ని బహూకరించారు. 3.50 కిలోల బరువున్న ఈ స్వర్ణ కవచం బహూకరించారు. 3.50 కిలోల బరువున్న ఈ స్వర్ణకవచంలో సుమారు 300లకు పైగా వజ్రాలు పొదిగి ఉన్నాయని కాళహస్తి ఆలయ నిర్వాహం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. |