కట్టుదిట్టమైన భద్రతల నడుమ 132వ జగన్నాథ రథయాత్ర బుధవారం ఉదయం అలహాబాద్‌లో ప్రారంభమైంది. ఈ యాత్ర మూడు రోజులపాటు జరుగనుంది.
సాంప్రదాయబద్దంగా ఈ యాత్రకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పచ్చజెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కాసేపు ఈ రథాన్ని లాగారు. ఈ రథంలో జగన్నాథుడు, బలరాముడు మరియు వారి సోదరి సుభద్రల విగ్రహాలను అంగరంగవైభవంగా అలంకరించి ప్రతిష్టించియున్నారు.
ఈ రథయాత్రను అలహాబాద్‌లో ఎన్నో సంవత్సరాలుగా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా జరుపుతున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోడీ తెలిపారు. రథయాత్రలో భాగంగా పద్దెనిమిది ఏనుగులతోపాటు అలంకరించిన మరో 98 ట్రక్కులు కూడా ఇందులో పాల్గొంటున్నాయి.
ఆ దేవదేవుడు జగన్నాథుని రథాన్ని లాగేందుకు ప్రజలు అత్యధిక సంఖ్యలో వివిధ ప్రాంతాలనుంచి అలహాబాద్‌కు తరలి వచ్చారు. పట్టణంలోని వివిధ ప్రాంతాలలో పోలీసుబలగాలు మొహరించి భద్రతా చర్యలను చేపట్టారు. |