ప్రపంచ ప్రఖ్యాతి చెందిన భువనేశ్వర్‌లోని పూరీ జగన్నాథుని రథయాత్రకు సర్వం సిద్ధం అయింది. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు జగన్నాథ రథ చక్రాలు కదలనున్నాయి. దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాన్ని తిలకించి పునీతులయ్యేందుకు భువనేశ్వర్‌లోని పూరీకి చేరుకున్నారు.
పన్నెండు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ జగన్నాథ రథోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 45 అడుగుల ఎత్తుతో 16 చక్రాలతో జగన్నాథుని రథం, 44 అడుగుల ఎత్తుతో 14 చక్రాలతో బలభద్రుని రథం, 43 అడుగుల ఎత్తుతో 12 చక్రాలతో సుభద్ర రథాలను సిద్దం చేశారు.
12 రోజులపాటు జరిగే ఈ రథయాత్రకు అత్యధిక సంఖ్యలో తరలి వస్తున్న భక్తకోటికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. గతంలో రథయాత్రలో భాగంగా తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఎలాంటి అవాఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు. |