రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల బోనాల ఉత్సవాలు ఎంతో ప్రసిద్ధి చెందినాయి. తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ బోనాల ఉత్సవాలు గోల్కోండలో నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
జులై నెల 12వ తేదీన సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళీ ఆలయంలో, 18, 19, 20 తేదీల్లో పాతబస్తీలోని లాల్‌దర్వాజలో బోనాల ఉత్సవాలు జరగనున్నాయి.
గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారి ఉత్సవాలతో ప్రారంభమయ్యే బోనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మకు బోనం సమర్పిస్తే కలరా, అతిసారంలాంటి రోగాలు దరి చేరవని ప్రజల విశ్వాసం. నెలరోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు జులై నెల 23వ తేదీతో ముగుస్తాయని ఆలయ అధికారులు తెలిపారు. |